మరో వీడియో కాన్ఫరెన్స్ కు సీఎంలను ఆహ్వానించిన ప్రధాని నరేంద్ర మోదీ

  • మే 3తో ముగియనున్న లాక్ డౌన్
  • 27న ముఖ్యమంత్రులతో సమావేశం
  • తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష
కరోనా మహమ్మారి కారణంగా ఇండియాలో అమలవుతున్న లాక్ డౌన్ వచ్చేనెల 3తో ముగియనున్న నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మరోసారి అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కావాలని నిర్ణయించారు. 27వ తేదీ సోమవారం ఈ కాన్ఫరెన్స్ జరుగనుంది.

తొలుత ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ ను ప్రకటించిన కేంద్రం ఆపై దాన్ని మే 3 వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిని అడ్డుకోవడమే లక్ష్యంగా లాక్ డౌన్ ను పొడిగించగా, తెలంగాణ మరో నాలుగు రోజుల పాటు... అంటే మే 7 వరకూ లాక్ డౌన్ ను అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ విషయంలో మిగతా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకే మోదీ ఈ వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించనున్నట్టు సమాచారం.

Narendra Modi
Video Conference
CMs

More Telugu News